ఆలోచించండి.. ఆచరించండి..


Sat,November 9, 2019 04:52 AM

కలెక్టరేట్ : ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను గుర్తిం చి, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మ నోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వినియోగం పై ప్రతి ఒక్కరూ ఆలోచించి, సింగిల్ యూజ్ వ స్తువుల నిషేధాన్ని శ్రద్ధగా ఆచరించాలని కోరారు. స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తున్న ఎమ్మెల్యే దాసరి, అధికారులు, నాయకులు శుక్రవారం చీకురాయి రోడ్డు మార్గంలోని పలు వీధుల్లో పర్యటించారు. ఆయా చోట్ల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. అక్కడి నుంచి ప్రధాన రహదారి వెంట ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తూ ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల కలిగే అనర్థాలను మహిళలు, విద్యార్థులు తదితరులకు వివరించా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సింగి ల్ యూసేజ్ ప్లాస్టిక్ వాడకాలను పూర్తి స్థాయిలో నిషేధించాలని కోరారు. ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలను దృష్టిలో పెట్టుకుని ప్రపంచమంతా ప్లాస్టిక్‌పై యుద్ధం ప్రకటించిందని చెప్పారు. ఈ క్ర మంలోనే ప్లాస్టిక్ వ్యర్థాలను ఆరుబయట పడేయ డం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లే ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని వాటిని సేకరిస్తున్నట్లు తెలిపారు.

తడి, పొడి చెత్తలను వేర్వేరుగా ఉంచి, పంచాయతీ, మున్సిపల్ సిబ్బందికి అప్పగించాల ని కోరారు. ఇంట్లో గృహ అవసరాలకు వాడిన చెత్తను ఎక్కడపడితే అక్కడ పడేయవద్దని కోరా రు. పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ ప్రత్యేకాధికారి, ఆర్డీఓ వెంకట ఉపేందర్‌రెడ్డి, మున్సిపల్ మేనేజర్ నయీమ్‌షా ఖాద్రీ, మున్సిపల్ అధికారులు సంపత్‌రెడ్డి, శివప్రసాద్, కరుణాకర్, జనార్దన్, నాయకులు జడల సురేందర్, అమ్రేశ్, కొండి సతీశ్, పూదరి మహేందర్, ఎరుకల రమేశ్, ఉప్పు రాజ్‌కుమార్, సాబీర్‌ఖాన్, ఏ తిరుపతి, వైద శ్రీనివాస్, పూదరి శేఖర్, బంక అశోక్, మామిడిపల్లి రాజేశం, నట్‌రాజ్, గజవెల్లి పురుషోత్తం, ఏఎన్‌ఎం సరోజ పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...