ప్రమాదరహిత కమిషనరేటే లక్ష్యం


Fri,November 8, 2019 03:42 AM

ఫెర్టిలైజర్‌సిటీ: జరిమానాలు విధించటం తమ ఉ ద్దేశంకాదనీ, ప్రజలు, వాహనదారుల ప్రాణాలు రక్షించి, ప్రమాదరహిత కమిషనరేట్‌గా మార్చడ మే తమ లక్ష్యమని రామగుండం సీపీ సత్యనారాయణ స్పష్టం చేశారు. పరిమితితోకూడిన వేగంతో వెళ్తే ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. అతివేగంతో వెళ్లటం ద్వారా జరిగే ప్రమాదాల నివారణకు కమిషనరేట్‌లో స్పీడ్ లేజర్‌గన్‌ను జిల్లాలో ఆగస్టు 5 నుంచి, మంచిర్యాల జిల్లాలో జూలై 23 నుంచి ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఇప్పటివరకు అతివేగంతో వెళ్తున్న వాహనాలపై రెండు జిల్లాల్లో ట్రాఫిక్ పోలీసులు నమోదు చేసిన కేసుల వివరాలను ఆయన గురువారం వెల్లడించారు. జిల్లాలో రామగుండం ట్రాఫిక్ పోలీసులు స్పీడ్ లేజర్ గన్ ద్వారా ఆగస్టులో 741కేసులు నమోదు చేసి రూ.7,66,935ల జరిమానాలు, సెప్టెంబర్ లో 599కేసుల దావ్రా రూ.9,30,465, అక్టోబర్‌లో 877 కేసుల ద్వారా రూ.9,07,695 జరిమానాలు, నవంబర్‌లో 6వ తేదీ వరకు 187 కేసుల దావ్రా రూ.1,93,545 మొత్తం 2704 కేసుల దావ్రా రూ.27,98,640 జరిమానాలు విధించినట్లు తెలిపారు. మంచిర్యాల జిల్లాలో 2354 కేసు ల ద్వారా రూ.24,36,390 జరిమానాలు విధించామన్నారు.

జూలైలో 25కేసుల ద్వా రా రూ.25, 875, ఆగస్టులో 725 కేసుల ద్వారా రూ.7,50, 375, సెప్టెంబర్‌లో 682కేసుల ద్వా రా రూ.7,05 870, అక్టోబర్‌లో 758కేసుల ద్వా రా రూ.7,84,530, నవంబర్‌లో 6వ తేదీ వరకు 164 కేసుల ద్వారా రూ.1,69,740 జరిమానాలు విధించినట్లు వివరించారు. సైడ్ లేజర్ గన్ యంత్రం ద్వారా పరిమితిమించిన వేగంతో వెళ్తు న్న వాహనాలను లేజర్ కిరణాల ద్వారా గుర్తించి ఫొటో తీస్తుందన్నారు. సంబంధిత వాహనాలకు ఈ చలాన్ విధానం ద్వారా జరిమానాలు పంపిస్తామని పేర్కొన్నారు. అతివేగంతో ప్రమా దాలను అరికట్టేందుకే స్పీడ్ గన్ విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. వేగంగా వెళ్తే రూ.వెయ్యి జరిమా నా విధిస్తామని అన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...