నిరుపేద కుటుంబాలకు సంక్షేమ ఫలాలు


Thu,November 7, 2019 01:20 AM

పెద్దపల్లిటౌన్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నిరుపేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నదని మండలి విప్ భానుప్రసాదరావు తెలిపారు. పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన చందా సుచరిత అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని దవాఖానలో చికిత్స పొందుతుండగా, సీఎం సహాయనిధి నుంచి మంజూరైన 90వేల ఎల్‌ఓసీ పత్రాన్ని బాధితులకు హైదరాబాద్‌లో బుధవారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను పేద కుటుంబాలకు అందజేసి అండగా నిలుస్తుందన్నారు. సీఎం కేసీఆర్ పేదల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని కొనియాడారు. కార్పొరేట్ దవాఖానల్లో వైద్య చేయించుకోలేని నిరుపేదలకు సీఎం సహాయనిధి నుంచి రూ. వందలాది కోట్లను మంజూరు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మండలి విప్ భానుప్రసాదరావుకు బాధిత కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...