పేపర్ ప్లేట్స్ తయారీ కేంద్రం ప్రారంభం


Thu,November 7, 2019 01:20 AM

పెద్దపల్లిటౌన్: పెద్దపల్లి మండలం రంగంపల్లి శివారులోని నూతన కలెక్టరేట్ సమీపంలో ఏర్పాటు చేసిన మల్లికార్జున పేపర్ ప్లేట్స్ తయారీ కేంద్రాన్ని బుధవారం ట్రాఫిక్ సీఐ బాబురావు ప్రారంభించా రు. పెద్దకల్వలకు చెందిన సలేంద్ర రవికి ముద్ర అగ్రికల్చర్ స్కిల్ డెవలప్‌మెంట్ మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ అందించిన రుణంతో పేపర్ ప్లేట్స్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించినంతరం ట్రాఫిక్ సీఐ మాట్లాడారు. ప్రభు త్వ ఉద్యోగాల కోసం యువకులు నిరీక్షించకుండా బ్యాంకులు, ముద్ర అగ్రికల్చర్ డెవలప్‌మెంట్ సొసైటీ లాంటి సంస్థలు అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. చిరువ్యాపారులు చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని నూతనంగా పేపర్‌పేట్ల తయారీ కేంద్రం ప్రారంభించామని యజమాని పేర్కొన్నారు. కార్యక్రమంలో ముద్ర అగ్రికల్చర్ స్కిల్ డెవలప్‌మెంట్ మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ రీజినల్ మేనేజర్ పి. శ్రీనివాస్, బ్రాంచి మేనేజర్లు ప్రశాంత్, క్రాంతి, అమరేందర్, నాయకులు సలేంద్ర కొమురయ్య, మడ్డి శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...