నేత్ర పర్వంగా గోదావరి హారతి


Thu,November 7, 2019 01:20 AM

ధర్మపురి క్షేత్రంలో బుధవారం గోదావరి హారతి కార్యక్రమం నేత్ర పర్వంగా సాగింది. కార్తీక మాసం తొమ్మిదో రోజైన బుధవారం సాయంత్రం లక్ష్మీనర్సింహస్వామి ఆలయం నుంచి వేద పండితుల మంత్రోచ్ఛరణ, మంగళవాయిద్యాల మధ్య అర్చకులు, సిబ్బంది గోదావరి నదీ తీరానికి శోభాయత్రగా తరలివెళ్లారు. నదిఒడ్డున పూజలు నిర్వహిం చి హారతిఇచ్చారు. అనంతరం భక్తులు నదిలో కార్తీక దీపాలను వదిలారు. వేదపండితులు బొజ్జ రమేశ్‌శర్మ, ముత్యాలశర్మ, సూపరింటెండెంట్ కిరణ్‌కుమార్, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.- ధర్మపురి, నమస్తే తెలంగాణ

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...