రెవెన్యూ సమస్యలు ప్రభుత్వానికి నివేదిస్తా


Thu,November 7, 2019 01:20 AM

కలెక్టరేట్: జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులకు సం బంధించిన సమస్యలను పూర్తిస్థాయి నివేదిక ద్వారా ప్రభుత్వానికి నివేదిస్తామని కలెక్టర్ శ్రీదేవసేన అన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తాసిల్దార్ విజయారెడ్డి హత్య ఘటన నేపథ్యంలో ఉద్యోగుల నిరసనలు జిల్లాలో కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే బుధవారం కలెక్టరేట్ భవన సముదాయం ఎదుట ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన దీక్షలు చేపట్టారు. అనంతరం కలెక్టర్ శ్రీదేవసేనను క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ ఉద్యోగులు, టీఎన్‌జీఓ సభ్యు లు, ట్రెసా ఉద్యోగులు కలిశారు. దీంతో వారితో ప్రత్యేకంగా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీదేవసేన మాట్లాడుతూ, తాసిల్దార్ హత్య ఘట న హేయమైన చర్య అని, ఇలాంటి సంఘటనలు జరుగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తంచేశా రు. రెవెన్యూ ఉద్యోగులు ఎలాంటి నిరుత్సాహాని కి, భయాందోళనకు గురి కావల్సిన అవసరం లేదనీ, ప్రభుత్వ మార్గదర్శకాలు నిబంధనల మేరకు నిర్భయంగా విధులను నిర్వర్తించాలనీ అ న్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీదేవసేన దృష్టికి రెవెన్యూ ఉద్యోగులు పలు సమస్యలను తీసుకొచ్చారు. ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకెళ్లానని ఆమె వారికి తెలిపారు. కాగా అబ్దుల్లాపూర్‌మెట్ తాసిల్దార్ వద్ద ప్రైవేట్‌గా పనిచేసే డ్రైవర్ గురునాథం కూడా ఆ దాడి లో మరణించాడని, అతడి కుటుంబానికి ఆర్థిక చేయూతనందించేందుకు జిల్లా నుంచి కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్వో, ఆర్డీఓ, రెవెన్యూ ఉద్యోగులందరి నుంచి ఒక రోజు వేతనాన్ని ఆర్థికసా యంగా అందజేస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో ట్రెసా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎం మధుసూదన్, తాసిల్దార్లు దిండిగాల రవీందర్, రమేశ్, పెద్దపల్లి ట్రెసా కార్యదర్శి వినయ్, వీఆర్వోల సంఘం ప్రధాన కార్యదర్శి గొట్టం మల్లేశం, టీఎన్‌జీఓ సభ్యులు నూకల శంకర్, ఎం మహేశ్, వీ శ్రీధర్, వీఆర్‌ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు పంగ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...