స్వచ్ఛతకు పాటుపడాలి


Wed,November 6, 2019 02:12 AM

కలెక్టరేట్‌: స్వచ్ఛతకు ప్రతి ఒక్కరూ పాటుపడాల నీ, పారిశుధ్యంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవనీ కలెక్టర్‌ శ్రీదేవసేన అన్నారు. స్వచ్ఛ్‌ సర్వేక్షణ్‌ గ్రామీణ్‌ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న పారిశుధ్య చర్యలను పరిశీలించేందుకు మంగళవారం పెద్దబొంకూర్‌ గ్రామాన్ని కలెక్టర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలోని వీధులు, కాలనీల్లో కాలినడకన అధికారులతో కలిసి పర్యటిస్తూ పారిశుధ్య చర్యలను సమీక్షించారు. ప్రతి ఇంటిని పరిశీలించిన కలెక్టర్‌ ఇంకుడుగుంతలు, మరుగుదొడ్ల వాడకంపై అధికారులతోపాటు గృహ యజమానులను, గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఇండ్ల పరిసరాల్లో పిచ్చిమొక్కలు, తుమ్మ చెట్లు దట్టంగా ఉండడం, మురికి కూపాలను చూసి అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు అనుసరిస్తున్న విధానాలపై కలెక్టర్‌ అసహనం వ్యక్తం చేశారు. పెద్దబొంకూర్‌ గ్రామ సందర్శన సందర్భంగా కలెక్టర్‌ అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాలను శుభ్రం చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అందుకు గ్రామస్తులు కూడా సహకరించాలని సూచించారు.

ఈ ఏడాదిలో వర్షాలు అధికంగా కురుస్తున్న నేపథ్యంలో మురికినీరు నిలిచి అపరిశుభ్ర వాతావరణం ఏర్పడే అవకాశం ఉందనీ, పారిశుధ్య చర్యలు చేపట్టేందుకు నవంబర్‌ 4 నుంచి డిసెంబర్‌ 5 వరకు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టేందుకు షెడ్యూల్‌ ఖరారు చేశామనీ వెల్లడించారు. నెలరోజులపాటు ఉదయం 7 నుంచి 9గంటల వరకు గ్రామస్థాయి అధికారులు, సిబ్బంది ప్రతి ఇంటికెళ్లి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేలా, నీటినిల్వలు లేకుం డా చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామంలో అధికార యంత్రాంగం పారిశుధ్యంపై అన్ని చర్య లు తీసుకుంటున్నప్పటికీ ప్రాణాంతకమైన డెంగీ వ్యాధికి గురికావడం విస్మయాన్ని కలిగించిందన్నారు. ప్లాస్టిక్‌ వినియోగాన్ని గ్రామంలో పూర్తిగా నిషేధించాలని ఆదేశాలు జారీ చేశారు. రైతుల విజ్ఞప్తి మేరకు గ్రామంలో కొత్త ఐకేపీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామంలో రాజకీయాలకతీతంగా పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టాలని, అందరూ కలిసి పనిచేస్తేనే ఊరంతా ఆరోగ్యవంతులుగా ఉంటారని, ఆ దిశగా కృషి చేయాలని కలెక్టర్‌ సూచించారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీడీఓ ఎం రాజు, సర్పంచ్‌ కారుపాక ల మానస, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ ప్రమోద్‌కుమార్‌, రాఘవాపూర్‌ పీహెచ్‌సీ డాక్టర్‌ మమత, ఎంపీటీసీ మిట్టపల్లి వసంత, మాజీ ఎంపీటీసీ కారుపాకల సంపత్‌, వైద్యసిబ్బంది, ఉపాధి హామీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...