పథకాలే మాకు శ్రీరామరక్ష


Tue,November 5, 2019 03:11 AM

-వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తాం
-50 డివిజన్లలో సత్తాచూపి బల్దియాపై గులాబీ జెండా ఎగరేస్తాం
-ఎమ్మెల్యే కోరుకంటి చందర్
-నగరంలో టీఆర్‌ఎస్ నాయకులతో సమావేశం

గోదావరిఖని,నమస్తే తెలంగాణ: దేశంలోనే ఆదర్శ పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే పార్టీకి శ్రీరామరక్ష అని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గోదావరిఖనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం కార్పొరేషన్‌లోని అన్ని డివిజన్ల నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 50 డివిజన్లు క్లీన్‌స్వీప్ చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు అంటేనే ప్రజా సేవకులనీ, నిత్యం ప్రజాసేవ చేసే వారికి ప్రజల ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందన్నారు. కార్పొరేషన్ పరిధిలో తాము చేపట్టిన ప్రగతి ప్రణాళిక బాటలో ప్రజలతో మమేకమై టీఆర్‌ఎస్ శ్రేణులు చేపట్టిన సేవా కార్యక్రమాలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందన్నారు. విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుట్టుమిషన్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నామనీ తెలిపారు. ప్రతి డివిజన్‌లో మహిళా ఉపాధి మార్గాల కల్పన కోసం మహిళా సాధికారిక సెంటర్లు ఏర్పాట్లు చేయనున్నామని వెల్లడించారు. సమావేశంలో నాయకులు పాతపెల్లి ఎల్లయ్య, పెంట రాజేశ్, శంకర్‌గౌడ్, మారుతి, చుక్కల శ్రీనివాస్, రాజు, సాగంటి శంకర్ సాయి, బుచ్చిరెడ్డి, కిషన్, భాస్కర్, సమ్మయ్యయాదవ్ తదితరులున్నారు.

సామాన్యులకు అండగా..
నియోజకవర్గంలోని సామాన్యులకు అండగా నిలవడమే తమ లక్ష్యమనీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో వైండింగ్ అసోసియేషన్ సభ్యులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వైండింగ్ వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు. ప్రతి ఒక్కరు బ్యాం కు ఖాతా కలిగి ఉండాలనీ, తద్వారా వారికి రుణా లు పొందే అవకాశం ఉంటుందనీ సూచించారు. కార్యక్రమంలో వైండింగ్ అసోసియేషన్ నాయకులు కృష్ణమూర్తి, భూమయ్య, కుమార్, శంకరమూర్తి, కొమురయ్య, కందుకూరి శ్రీనివాస్, టీఆర్‌ఎస్ నాయకులు పాతపెల్లి ఎల్లయ్య, పెంట రాజేశ్, శంకర్‌గౌడ్, మారుతి, చుక్కల శ్రీనివాస్, రాజు, సాగంటి శంకర్, కుంట సాయి, బుచ్చిరెడ్డి, భాస్కర్, సమ్మయ్య యాదవ్‌తోపాటు అధిక సంఖ్యలో నాయకులున్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...