తనిఖీలు పారదర్శకంగా చేపట్టాలి


Tue,November 5, 2019 03:09 AM

ఎలిగేడు(జూలపల్లి): గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులపై సిబ్బంది పారదర్శంగా సామాజిక తనిఖీ చేపట్టాలని ఎంపీపీ తానిపర్తి స్రవంతి పేర్కొన్నారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సోమవారం ఈజీఎస్ పథకంపై సామాజిక తనిఖీ బృందం సభ్యులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 2018-2019సంవత్సరకాలంలో మండలంలో దాదాపు రూ.2కోట్ల పైచిలుకు నిధులు ఖర్చు చేసి పలు పనులు చేపట్టారనీ, తనిఖీ బృందం క్షేత్రస్థాయిలో పనులు నిశితంగా పరిశీలించి వాస్తవాలు వెల్లడించాలనీ పేర్కొన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో 12వ సామాజిక తనిఖీలు నిర్వహించి ప్రజలకు జవాబుదారీగా ఉండాలని కోరారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని నొక్కిచెప్పారు. గ్రామాల్లో తనిఖీ చేసిన పనుల నివేదికలు ప్రజల సమక్షంలో చదివి వినిపించి ఆపోహలు తొలగించాలని సూచించారు. ఇక్కడ ఎంపీడీఓ శ్రీనివాసమూర్తి, ఏపీఓ సదానందం, ఎస్‌ఆర్పీలు, డీఆర్పీలు, టీఏ, ఫీల్డ్‌అసిస్టెంట్లు పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...