అంకితభావంతో పనిచేయాలి


Tue,November 5, 2019 03:09 AM

-జిల్లా విద్యాధికారి జగన్మోహన్‌రెడ్డి
ధర్మారం: ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేసి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని జిల్లా విద్యాధికారి బీ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ధర్మారం, దొంగతుర్తి కాంప్లెక్స్‌లకు చెందిన ప్రాథమిక, యూపీఎస్ స్థాయి సమావేశాలు వేర్వేరుగా జరిగాయి. ఈ సమావేశాలను డీఈవో తనిఖీ చేసి పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఉపాధ్యాయులకు విద్యార్థులకు ఉత్తమబోధన అందించాలని పేర్కొన్నారు. చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించేలా దృషిసారించాలని చెప్పారు. ప్రభుత్వం ద్వారా చేపట్టే కార్యక్రమాలను గుర్తించి తనకు నివేదిక పంపించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎంఈఓ పినుమల్ల ఛాయాదేవి, దొంగతుర్తి కాంప్లెక్స్ హెచ్‌ఎం అనురాధ హాజరు కాగా, యూపీ కాంప్లెక్స్ స్థాయిలో ఆర్‌పీలుగా రాంపల్లి విజయ్‌భాస్కర్, నర్సింహరెడ్డి, పీఎస్ స్థాయిలో సుధాకర్, పిల్లలమర్రి సత్తయ్య, హైమావతి వ్యవహరించారు. సీఆర్‌పీలు కవిత, ఐలయ్య, శ్రీలత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కాగా మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని డీఈవో పరిశీలించారు. అలాగే ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్, ఇతర రికార్డులను తనిఖీ చేశారు. ఆయన వెంట ఎంఈఓ ఛాయాదేవి, ఇన్‌చార్జి హెచ్‌ఎం వసంత తదితరులు ఉన్నారు.

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...