ప్రస్తుత సమాజంలో అందరూ జవాబుదారులే


Tue,November 5, 2019 03:09 AM

కలెక్టరేట్: ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ జవాబుదారీగా ఉండాలని కలెక్టర్ శ్రీదేవసేన అన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావా ణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పలు రకాల సమస్యలపై వచ్చిన 66 దరఖాస్తులను ఆమె స్వీకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని సంబంధిత శాఖలకు బదిలీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీదేవసేన మాట్లాడుతూ, మారుతున్న పరిస్థితులకనుగుణంగా పారిశుధ్య నిర్వహణలో ప్రత్యేక దృష్టితో ముందుకుసాగుతున్నామని తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించా లని ఆదేశించారు. స్వచ్ఛత విషయంలో ప్రతి ఒ క్కరూ భాగస్వాములై పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రజలం తా ఏ మాత్రం బాధ్యతారహితంగా మెదులుతూ కేవలం అధికారులే పనులు చేయాలన్న ఆలోచనను పక్కనబెట్టి ప్రతి ఒక్కరు జవాబుదారులేనన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని నొక్కిచెప్పా రు. అధికార యంత్రాంగం చేస్తున్న కృషికి ప్రజల తోడ్పాటు కూడా తోడైతే మంచి ఫలితాలు వస్తాయని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడుతుందని అన్నారు. ఈనెల 4 నుంచి డిసెంబర్ 5వరకు ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా పారిశుధ్య నిర్వహణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామనీ, గ్రామస్థాయి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వనజాదేవి, ఇన్‌చార్జి డీఆర్వో నర్సింహామూర్తి, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...