దిగ్విజయంగా వేంకటేశ్వరుడి కల్యాణం


Tue,November 5, 2019 03:08 AM

మంథని రూరల్: వేదాలకు నిలయమైన మంత్రపురి గడ్డమీద మొట్టమొదటిసారిగా నిర్వహించిన శ్రీ వేంకటేశ్వరుని కల్యాణం అంగరంగ వైభవంగా దిగ్విజయంగా జరిగిందని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, శ్రీనివాసుడి కృప వల్ల కల్యాణానికి ఎలాంటి ఆటంకం లేకుం డా ప్రకృతి సహకరించిందని అన్నారు. కార్యక్రమ విజయవంతానికి కృషిచేసిన పుట్ట లింగమ్మ ట్రస్టు నిర్వాహకులకు, వలంటీర్లకు ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. కల్యాణాన్ని తిలకించిన వారి ఇంట్లో సుఖసంతోషాలు, సిరి సంపదలు వెల్లివిరియాలని ఆ దేవుడు వారికి ఆయూరారోగ్యాలు ప్రసాదించాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు గొప్పురి సత్యంరాజు కుమారుడు వంశీరాజ్ టీఆర్‌ఎస్ పార్టీలో చేరగా జడ్పీ చైర్మన్ ఫుట మధూకర్ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలో కష్టపడి పని చేసిన వారికి గుర్తింపు ఉంటుందని అన్నారు. రానున్న ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ కొండ శంకర్, జడ్పీటీసీ తగరంం సుమలత, టీఆర్‌ఎస్ పార్టీ మండల, పట్టణాధ్యక్షుడు కొత్త శ్రీనివాస్, బత్తుల సత్యనారాయణ నాయకులు తగరం శంకర్‌లాల్, వీకే రవి, గర్రెపల్లి సత్యనారాయణ, మారుతిరావు, కొట్టె రమేశ్, ఖలీల్‌లతో పాటు పలువురు ఉన్నారు. శ్రీనివాసుడి కల్యాణం మహోత్సవ విజయవంతంపై ఆనందం వ్యక్తం చేశారు. పాల్గొన్న మంత్రులు కొప్పుల, గంగుల, ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్, జేసీ, వలంటీర్లకు, టీఆర్‌ఎస్ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...