విధుల్లో చేరే ఆర్టీసీ ఉద్యోగులకు భద్రత


Mon,November 4, 2019 02:07 AM

ఫెర్టిలైజర్‌సిటీ: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో సమ్మె విరమించుకొని విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్న ఆర్టీసీ డ్రైవర్లకు, కండక్టర్లకు పోలీస్ శాఖ నుంచి పూర్తి రక్షణ కల్పిస్తామని సీపీ సత్యనారాయణ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పిలుపు మేరకు ఆర్టీసీ ఉద్యోగులు నిర్భయంగా విధుల్లో చేరవచ్చనీ, విధుల్లో చేరుతున్న ఆర్టీసీ ఉద్యోగులను ఎవరైనా బెదిరించినా, భౌతిక దాడులకు పాల్పడినా, ఏ విధమైన ఆర్టీసీ ఆస్తులకు నష్టం కలిగించినా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఉద్యోగాల్లో తిరిగి చేరాలనుకునే వారిని ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అటంకించినా, ఘెరావ్ చేసినా, బెదిరింపులకు పాల్పడినా వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...