‘రెస్క్యూ’కు రెడీ


Wed,October 23, 2019 02:34 AM

యైటింక్లయిన్‌ కాలనీ : సింగరేణి ఆర్జీ-2 రెస్యూ స్టేషన్‌ 50వ జోనల్‌ పోటీలకు సిద్ధమయ్యింది. ఈ క్రమంలో డీడీఎంఎస్‌, సింగరేణి సంయుక్తంగా ఈ నెల 23, 24 తేదీల్లో ఆర్జీ-2 ఏరియా సింగరేణి రెస్క్యూ స్టేషన్‌లో 50వ జోనల్‌ మైన్స్‌ రెస్క్యూ కాంపిటీషన్స్‌ నిర్వహిస్తున్నట్లు కార్పొరేట్‌ చీఫ్‌ జీఎం నాగభూషణ్‌ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆర్జీ-2 ఏరియాలోని మైన్స్‌ రెస్క్యూ స్టేషన్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్జీ-2 జీఎం కల్వల నారాయణ, రెస్క్యూ జీఎం ఎ.రవికుమార్‌, సేఫ్టీ జీఎం సత్యనారాయణలతో కలిసి ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యుత్తమ రెస్క్యూగా సింగరేణి ఖ్యాతిగాంచిందన్నారు. ఈ పోటీల్లో సింగరేణి వ్యాప్తంగా ఏడు రెస్క్యూ టీంలు పాల్గొనున్నాయని తెలిపారు. 23న ఉదయం 7.30 గటంలకు పతాకావిష్కరణ చేపట్టి పోటీలను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

24న సాయంత్రం జరుగనున్న ముగింపు ఉత్సవాల్లో సంస్థ సీఅండ్‌ఎండీ నడిమెట్ల శ్రీధర్‌తోపాటు డైరెక్టర్స్‌ హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ సారి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రెస్క్యూ డ్రిల్‌ను గ్యాలరీలో కాకుండా 7 ఎల్‌ఈపీ అండర్‌ గ్రౌండ్‌ మైన్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ రెస్క్యూ పోటీలు నిర్వహించడం ద్వారా రెస్క్యూ సభ్యులను నిరంతరం అప్రమత్తం చేయడం ముఖ్య ఉద్ధేశమని తెలిపారు. పోటీలతో రెస్క్యూ సభ్యుల నైపుణ్యాన్ని పెంపొందించి సింగరేణిలో విపత్తర పరిస్థితుల్లో కార్మికుల ప్రాణాలను, సంస్థ ఆస్తులను రక్షించడంపై మెలుకువలు నేర్చుకోవడం ముఖ్య ఉద్ధేశమని తెలిపారు. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన రెండు రెస్క్యూ టీంలను ఎంపిక చేసి నవంబర్‌ 18న ఒరిస్సాలోని మహానంది కోల్‌ ఫిల్డ్‌లో నిర్వహించే ఆల్‌ ఇండియా రెస్క్యూ పోటీలకు పంపించనున్నట్లు తెలిపారు. రెస్క్యూ పోటీలు బహుమతుల కోసం కాకుండా రెస్క్యూ సభ్యుల ప్రతిభను, దేహదార్యుడాన్ని, సమర్థతను పెంపొందించేందుకు ఎంతో దోహదపడుతాయని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో రెస్క్యూ మేనేజర్‌ అబ్దుల్‌ సలీం, అధికార ప్రతినిధి గుండా ప్రదీప్‌ కుమార్‌, ఏరియా సేఫ్టి అధికారి వేణుగోపాల్‌, ఎస్‌ఎస్‌ఓ రమణారెడ్డ్డి పాల్గొన్నారు. కాగా, ఈ పోటీల కోసం ఆర్జీ-2 మైన్స్‌ స్టేషన్‌ను విద్యుత్‌ కాంతులతో సర్వసుందరంగా తీర్చిదిద్దారు.

ఏడు
ఆర్జీ-1, ఆర్జీ-2, 3, ఏఎల్‌పీ, శ్రీరాంపూర్‌, మందమర్రి, బెల్లంపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు టీంలు పోటీల్లో పాల్గొననున్నాయి.

పోటీలు
ఈ టీంలు మార్చ్‌పాస్ట్‌, ఫస్ట్‌ ఎయిడ్‌ థియరీ, ఫస్ట్‌ ఎయిడ్‌ ప్రాక్టికల్స్‌, రెస్క్యూ, రికవరి, స్టాట్యూటరీ, అండర్‌ గ్రౌండ్‌ రెస్క్యూ అండ్‌ డ్రిల్‌ అంశాలపై రెస్క్యూ టీంలు తమ ప్రదర్శనను చేయనున్నాయి.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...