పాలనలో కీలక పాత్ర పోషించాలి


Mon,October 21, 2019 04:27 AM

జూలపల్లి : గ్రామాభివృద్ధిలో కోఆప్షన్ సభ్యులు కీలక పాత్ర పోషించి ఆదర్శంగా నిలవాలని జడ్పీ సభ్యుడు బొద్దుల లక్ష్మణ్ సూచించారు. ఇటీవల కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన మేకల నారాయణ, నాగపురి రేణుకను తేలుకుంట గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఆదివారం పంచాయతీ పాలక వర్గంతోపాటు, లక్ష్మణ్ ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. అలాగే న్యాడెం కంపోస్ట్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లో అంతర్గత రహదారులు, తాగునీరు, విద్యుత్ దీపాలు, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రజలకు సేవలందించాలన్నారు. మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని పేర్కొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు అందరూ ఏకమై గ్రామాన్ని చక్కదిద్దుకోవాలని విజ్ఞప్తి చేశారు. పరిసరాల పరిశుభ్రతపై నిత్యం తోడ్పడాలని చెప్పారు. మురుగు నీటి గుంతలు లేకుండా, రోడ్లపై చెత్తా చెదారం పడేయకుండా గ్రామస్తులను చైతన్యవంతం చేయాలని పిలుపునిచ్చారు. పచ్చదనం ఆవశ్యకతను ప్రతి ఒక్కరికి వివరించి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఇక్కడ సర్పంచ్ సొల్లు పద్మ, ఉప సర్పంచ్ చొప్పరి నర్సింగం, వార్డు సభ్యులు చిప్ప రమేశ్, అడ్డగుంట శ్రీనివాస్, జనుప తిరుపతి, అడ్డగుంట పర్శరాములు, తీగల భాగ్యలక్ష్మి, మడ్డి నాగమ్మ, జవ్వాజి శ్రీలత, నాయకులు సొల్లు శ్యామ్, మంద లక్ష్మణ్, తమ్మడవేని పోశాలు, చొప్పరి శేఖర్, గ్రామ ప్రత్యేకాధికారి తులసీమాత తదితరులు పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...