ప్లాస్టిక్‌పై సమర భేరి


Sat,October 19, 2019 02:33 AM

-పర్యావరణహితమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం అడుగులు
-బల్దియాల్లో స్వచ్ఛతా హీ సేవ కింద జోరుగా కార్యక్రమాలు
-స్వయంగా రంగంలోకి దిగిన ఎమ్మెల్యేలు, కలెక్టర్, జేసీ

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ప్లాస్టిక్ రహిత పట్టణాలే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు శుక్రవారం జిల్లాలోని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలో స్వచ్ఛతా హీ సేవ, స్వచ్ఛ్ శుక్రవారం కింద సింగిల్ యుసేజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా ఏరివేసింది.

స్వయంగా సేకరించిన ఎమ్మెల్యేలు, కలెక్టర్..
స్వచ్ఛతా హీసేవ, స్వచ్ఛ్ ఫ్రై డే లో భాగంగా జిల్లా కేంద్రం పెద్దపల్లిలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, కలెక్టర్ శ్రీ దేవసేన, జిల్లా పంచాయతీ అధికారి వేముల సుదర్శన్, రామగుండంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్, జేసీ వనజాదేవి, మునిసిపల్ కమిషనర్ శ్రీనివాస్ స్వయంగా రంగంలోకి దిగారు. ఇతర అధికారులు, సిబ్బందితో కలిసి ప్లాస్టిక్‌ను సేకరించి, ప్రజల్లో చైతన్యం తెచ్చారు. సంచులు చేత పట్టుకొని రోడ్ల వెంట, గృహ సముదాయాల ఆవరణలో కలియదిరుగుతూ ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. ఓ వైపు పారిశుధ్యంపై దృష్టి సారిస్తూనే ప్లాస్టిక్‌పై సమర శంఖం పూరించారు. కలెక్టర్, ఎమ్మెల్యేలు స్వయంగా సంచులు చేత బట్టి వ్యర్థాలను ఏరడంతో ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు అనుకరించారు. ఇక మంథని మున్సిపాల్టీ పరిధిలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఆర్డీఓ మెంచె నగేశ్, ఎంపీపీ కొండా శంకర్, కమిషనర్ గుట్ట మల్లికార్జున స్వామితో సహా ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు కార్యక్రమంలో పాల్గొని వ్యర్థాలను సేకరించారు. అదే విధంగా సుల్తానాబాద్ మున్సిపాల్టీలో సైతం ఎరివేశారు.

రామగుండంలో 12 మెట్రిక్ టన్నుల సేకరణ
సింగిల్ యుసేజ్ ప్లాస్టిక్ నియంత్రణలో భాగంగా రామగుండం నగరంలో ఒక్కరోజే 12మెట్రిక్ టన్నులు సేకరించారు. జిల్లా కేంద్రమైన పెద్దపల్లి మున్సిపాల్టీ పరిధిలో 10క్వింటాళ్లు, మంథని, సుల్తానాబాద్‌లో దాదాపు క్వింటాల్ వ్యర్థాలను సంచుల్లో సేకరించి రీ సైక్లింగ్ కోసం పంపించారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles