వ్యవసాయ కోతలు షురూ..


Sat,October 19, 2019 02:31 AM


ఓదెల: ఖరీఫ్ వ్యవసాయ ఉత్పత్తులు కోత దశకు వచ్చాయి. సీజన్ ప్రారంభంలో ఆశించిన వర్షాలు లేకపోయిన రైతులు బావుల మీద ఆధారపడి వరి, మక్క, పత్తి వేశారు. ప్రస్తుతం వరి, మక్క పంటలు చేతికి రావడంతో కోస్తున్నారు. రెండు రోజుగా కురుస్తున్న వరుస వర్షాలతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నోటికాడికి వచ్చిన తర్వాత వర్షాలు కురుస్తుండడంతో తీవ్రంగా నష్టపోనున్నట్లు పేర్కొంటున్నారు. ప్రస్తుత ఖరీఫ్ వ్యవసాయ సీజన్‌లో ఓదెల మండలంలో వరి- 18,204 ఎకరాలు, మక్క- 1062, పత్తి- 9429, పసు పు-124, కంది-70, మిరప-28, వంకాయ-5, పెసర-26, బెండ-6, టమాట-15, అలసంద-2 ఎకరాల్లో సాగైంది. అలాగే ఈ సంవత్సరం పలు పంటలకు ప్రభుత్వం మద్దతు ధర కూడా పెంచింది. వరిధాన్యం(గ్రేడ్ ఏ రకం)- 1835, సాధారణ రకానికి- 1815, మక్కకు- 1760, పత్తి (పొడువు పింజ రకం)- 5550, మధ్య రకం పింజ పొడవుకు- 5255, కందులు- 5800, పెస లు- 7050 మద్దతు ధరగా ప్రభుత్వం ప్రకటించింది. ఓదె ల మక్కల కొనుగోలు కేంద్రంలో కంకులు రాసులుగా వచ్చి చేరినవి. ఇప్పుడిప్పుడే వరి కోసి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు తరలిస్తున్నారు. ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలు మరిన్ని త్వరగా ప్రారంభిస్తే రైతులు అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వర్షాల కారణంగా కొసిన ధాన్యం తడుస్తుందనే ఆందోళన రైతులను వెంటాడుతున్నది.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...