కొత్తూరులో బట్ట బ్యాగుల పంపిణీ


Sat,October 19, 2019 02:31 AM

ధర్మారం : ధర్మారం మండ లం కొత్తూరులో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రజలకు ఉచితంగా బట్ట బ్యాగుల పం పిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్లాస్టిక్ బ్యాగులను సమూలంగా నిర్మూలించేందుకు జీపీ తరఫున గ్రామస్తులకు పంపిణీ చేసేందుకు 800 బట్ట బ్యాగులను సర్పంచ్ తాళ్ల మల్లేశం ఆధ్వర్యంలో కొనుగోలు చేశారు. దీంతో శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఎంపీడీఓ డి.బాలరాజు, ఎంపీటీసీ సభ్యురాలు తాళ్లపల్లి భద్రమ్మ, ఉప సర్పంచ్ బానోతు రాజేశ్వరి ప్రజలకు బ్యాగులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రమేశ్, ఫీల్డు అసిస్టెంట్ ఆంజనేయులు, టీఆర్‌ఎస్ నాయకులు బానోతు రాజేశం నాయక్, సాయిని కొమురయ్య పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...