అనాథ పిల్లలను ఆదుకుంటా


Sat,October 19, 2019 02:31 AM

జూలపల్లి : కుమ్మరికుంట గ్రామానికి చెందిన అనాథ పిల్లలు జారతి వంశీ, సౌమ్యను ఆదుకుంటానని టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నేత, నల్లా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు నల్లా మనోహర్‌రెడ్డి భరోసా ఇచ్చారు. అనారోగ్యంతో బాధపడుతూ తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను శుక్రవారం పరామర్శించి ఓదార్చారు. తల్లిదండ్రులను కోల్పోయామనీ బాధపడక, ఆత్మవిశ్వాసంతో కష్టపడి చదువుకోవాలని సూచించారు. పిల్లలకు చదువుల ఖర్చులు భరిస్తానని పేర్కొన్నారు. ఇక్కడ సర్పంచ్ మేచినేని సంతోష్‌రావు, ఎంపీటీసీ సభ్యుడు తమ్మడవేని మల్లేశం, ఉప సర్పంచ్ కొత్త మల్లేశం, ఉప సర్పంచుల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు అడువాల తిరుపతి, తాటిపెల్లి రాయలింగం తదితరులు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...