ఎకరం 14 గుంటల భూమి విరాళం


Fri,October 18, 2019 02:38 AM

ధర్మారం : బొట్లవనపర్తి గ్రామానికి చెందిన బొట్ల మల్లమ్మ, కొడుకులు బొట్ల లక్ష్మయ్య, బొట్ల ఉమాపతి ఎకరం 14 గుంటల భూమిని పంచాయతీకి దానం చేశారు. గ్రామ శివారులో శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు ఏర్పాటు కోసం కీ.శే బొట్ల హరయ్య జ్ఞాపకార్థం రూ.16 లక్షల విలువైన భూమిని విరాళంగా అందించారు. ఈ మేరకు సర్పంచ్ రెడపాక ప్రమీలకు గ్రామస్తులు, అధికారుల సమక్షంలో లిఖిత పూర్వకంగా అందజేశారు. అనంతరం ఆ స్థలంలో శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు నిర్మాణం కోసం సర్పంచ్ ప్రమీల అధ్వర్యంలో దాతలు మల్లమ్మ, లక్ష్మయ్య, ఉమాపతి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మోతె సుజాత, ఉప సర్పంచ్ మోటపలుకుల సత్యనారాయణ, ఎంపీఓ శంకరయ్య, కార్యదర్శి రమేశ్, పాలకవర్గం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...