యువకుడి రక్తదానం


Fri,October 18, 2019 02:38 AM

సుల్తానాబాద్ రూరల్: మండలంలోని ఐతరాజ్‌పల్లి గ్రామానికి చెందిన పూనం సందీప్ అనే యువకుడు రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచాడు. జగిత్యాలకు చెందిన భాస్కర్ అనే వ్యక్తికి కరీంనగర్‌లోని చల్మెడ ఆనందరావు దవాఖానలో డయాలసిస్ చేస్తున్న క్రమంలో రక్తం అవసరం ఉండగా, అతని కుటుంబసభ్యులు వైకే ఫౌండేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మడ్డి సాయికిషోర్‌గౌడ్‌ను సంప్రదించారు. వెంటనే స్పందించి పూనం సందీప్‌కు విషయాన్ని వివరించగా ఆయన స్పందించినట్లు సాయికిషోర్‌గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా సందీప్‌ను వైకే ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కడెం సురేశ్, గౌరవాధ్యక్షుడు విజేందర్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజు, ఉపాధ్యక్షులు శ్రీతేజ, బాధితుని కుటుంబసభ్యులు అభినందించారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...