ఉజ్వల భవిష్యత్‌కు తోడ్పడాలి


Fri,October 18, 2019 02:37 AM

జూలపల్లి: బాలల ఉజ్వల భవిష్యత్‌కు ప్రతి ఒక్క రూ తోడ్పడాలని కోరుతూ కుమ్మరికుంటలో గురువారం అవగాహన సదస్సు ఏర్పాటు నిర్వహించారు. ఐసీడీఎస్, చైల్డ్‌లైన్, సఖీ కేంద్రం ఆధ్వర్యంలో బాలబాలికలు, మహిళల సమస్యలు, హ క్కుల గురించి వివరించారు. బాల్య వివాహాలు, అనర్థాలు, అత్యాచారాలు, అక్రమ రవాణాపై జా గ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమాజం నుంచి బాల కార్మిక వవ్యస్థను రూపుమాపాలని పేర్కొన్నారు. చైల్డ్ లైన్ సేవలకు 1098 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. సఖీ కేంద్రం ద్వారా వైద్య సేవలు, కౌన్సెలింగ్, పోలీస్, న్యాయ సహాయ, తాత్కాలిక సేవలు పొం దవచ్చని వెల్లడించారు. మహిళా సమస్యల పరిష్కారానికి సఖీ కేంద్రం పని చేస్తుందని తెలిపారు. ఇక్కడ ఎంపీటీసీ తమ్మడవేని మల్లేశం, బాలిక ర క్షా భవన్ సమన్వయకర్త సుగుణ, రక్షణ అధికారు లు జితేందర్, కనుకరాజ్, పర్యవేక్షకులు రాజమ ణి, చైల్డ్ లైన్ సమన్వయకర్త ఉమాదేవి, సఖీ కేంద్ర నిర్వాహకులు స్వప్న, సభ్యుడు బుచ్చిబాబు, కేస్ వర్కర్ సంపూర్ణ, అనిత, అంగన్‌వాడీ టీచర్లు కొమురమ్మ, సరిత, ఆశా కార్యకర్తలున్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...