రెగట్ట పోటీల నిర్వహణపై గోదావరి నది పరిశీలన


Thu,October 17, 2019 02:40 AM

గోదావరిఖని,నమస్తే తెలంగాణ: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రెగట్టా పోటీల నిర్వహణపై క్రీడల నిపుణులు బుధవారం గోదావరిఖని శివారులోని గోదావరి నది వంతెనను బుధవారం పరిశీలించారు. సెప్టెంబర 29న రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో గోదావరి నదిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి తెప్పల పోటీలకు అనూహ్య స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ను ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కలిసి పోటీలకు సంబంధించిన ఫొటో ప్రజెంటేషన్ చేశారు. అనంతరం సీఎం కేసీఆర్ చందర్‌ను అభినందించి ప్రతిఏటా రెగట్టా పడవల పోటీలు గోదావరి నది వంతెన్న వద్ద నిర్వహించే విషయమై సంబంధితశాఖ మంత్రికి ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాల నేపథ్యంలో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల క్రీడా, యువజన శాఖ అధికారులు రాజవీరు, శ్రీకాంత్‌రెడ్డి, హైదరాబాద్ నుంచి రెగట్టా పోటీల నిర్వహణ టెక్నికల్ టీం సభ్యులు రామకృష్ణలు గోదావరి నదిని పరిశీలించారు. పోటీల నిర్వహణకు సంబంధించి పూర్తి నివేదికను తయారు చేయడానికి సందర్శించినట్లు తెలిపారు. వీరి వెంట మత్స్యవీర కేసీఆర్ కప్ కన్వీనర్ గోలివాడ ప్రసన్నకుమార్, శ్రావణ్, నిజామొద్దిన్, శ్రీనివాస్ ఉన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...