జీవనోపాధికి ప్రభుత్వం భరోసా


Tue,October 15, 2019 02:09 AM

ఎలిగేడు(జూలపల్లి) : మత్స్యకారుల కుటుంబాలకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేస్తుందని జిల్లా మత్స్య శాఖ అధికారి మల్లేశం పేర్కొన్నారు. ఎలిగేడు మండలం నారాయణపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో సోమవారం వైస్ ఎంపీపీ బుర్ర వీరస్వామిగౌడ్ మత్స్యకారులకు చేప పిల్లలు పంపిణీ చే శారు. ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ, ఎలిగేడు మండలంలో 49 చెరువులు, కుంటలు ఉన్నాయనీ, ప్రభుత్వం 4,51,170 లక్షల చేప పిల్లలు సరఫరా చేసిందని తెలిపారు. చేపల పెంపకం ద్వారా ఆర్థికంగా ఎదగవచ్చని అభిప్రాయపడ్డా రు. మత్స్యకారులకు ఉపాధి తోపాటు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పోషక విలువులున్న మాంసాహారం అందుతుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1104 చెరువులు, కుంటల్లో కోటీ 41 లక్షల చేప పిల్లలు వదలడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వీటిపై 159 మత్స్య కార్మిక సహకార సంఘాల సభ్యులు ఆధారపడి ఉన్నారని వివరించారు. జిల్లాలో ఇప్పటి వరకు ఏడు మండలాల్లో చేపల పంపిణీ ప్రక్రియ పూర్తి చేశామనీ, ఈ నెల 20 లోగా మిగతా పంపిణీ చేస్తామని వెల్లడించారు. మత్స్యకారులను ఆదుకునేందుకు ప్రభుత్వం రాయితీ పనిముట్లు అందిస్తుందన్నారు. ఇక్కడ సర్పంచులు మాడ కొండల్‌రెడ్డి, స్వప్న, ఉప సర్పంచ్ సబ్బు శ్రీధర్, సొసైటీ అధ్యక్షుడు సబ్బు రాజయ్య, ఫీల్డ్ ఆఫీసర్లు హరీశ్, సురేశ్, ఫీల్డ్ అసిస్టెంట్లు రవి, స్వామి తదితరులున్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...