ప్రజారోగ్యమే ప్రథమ లక్ష్యం


Sun,October 13, 2019 12:46 AM

కలెక్టరేట్‌ : ప్రజారోగ్యమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి స్పష్టం చేశారు. కార్పొరేట్‌ వైద్యం చే యించుకోలేని పేద వర్గాలకు సీఎంఆర్‌ఎఫ్‌ వరం లా మారిందని కొనియాడారు. పలువురు లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను, జి ల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో దాసరి పంపిణీ చేశారు. పెద్దపల్లి మండలం చందపల్లికి చెందిన పెర్క మల్లేశం, సుల్తానాబాద్‌ మండలం పూసాలకు చెందిన వీ అనిల్‌కు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడినపోయిన కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. సీఎం కేసీఆర్‌ మానవతా దృక్పథంతో ఆలోచించి ప్రైవేట్‌ దవాఖానల్లో వైద్యం చేయించుకున్న వారికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బుర్ర శ్రీనివాస్‌గౌడ్‌, కొక్కిస రవీందర్‌గౌడ్‌, ఎడ్ల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...