సదరమ్ క్యాంపు రిజిస్ట్రేషన్ల ముగింపు


Sat,September 21, 2019 01:12 AM

పెద్దపల్లిటౌన్: పెద్దపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన దివ్యాం గుల ఎంపిక కోసం నిర్వహించే సదరమ్ క్యాంపులో పాల్గొనేందుకు పేర్ల నమోదు కార్యక్రమం ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. వివిధ మండలాల నుంచి వందల సంఖ్యలో విద్యార్థులు వారి కుటుంబ సభ్యులు క్యూలైన్లలో నిలబడి నాలుగు రోజులుగా పేర్లు నమోదు చేసుకున్నారు. సోమవారం ప్రారంభమైన క్యాంపు కోసం రిజిస్ట్రే షన్లు మొ దటి రోజు సోమవారం 314, మంగళవారం 336, బుధవారం 357, గురువారం 277, శుక్రవారం 355 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ సంద ర్భంగా ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ రమాకాంత్ మాట్లాడుతూ, ఐదు రోజులుగా నిర్వహిస్తున్న సదరమ్ క్యాంపు రిజిస్ట్రేషన్లలో 1639 మంది తమ పేర్లు నమోదు చేసుకోగా వారి కోసం ఈ నెల 26న దవాఖాన ఆవరణలో సదరమ్ క్యాంపు ఏర్పాటు చేసి సర్టిఫికెట్ల కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. సదరమ్ క్యాంపు నిర్వహణతో పాటు కార్యక్రమానికి అధిక సంఖ్యలో దివ్యాంగులు వారి కుటుంబ సభ్యులు వచ్చే అవకాశం ఉందని వివరించారు. వారి కోసం సౌకర్యాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...