చిన్నారుల ఆరోగ్యానికి రోటా రక్షణ


Sat,September 21, 2019 01:12 AM

ఎలిగేడు(జూలపల్లి) : చిన్నారుల ఆరోగ్యంపై రక్షణ చర్యలు ఎప్పటికప్పుడూ తీసుకోవాలని ఎంపీపీ తానిపర్తి స్రవంతి పేర్కొన్నారు. ఎలిగేడు ప్రభుత్వ దవా ఖానలో శుక్రవారం ఆమె చిన్నారులకు రోటా వైరస్ వ్యాక్సిన్ వేశారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ, రోటా వైరస్ వ్యాక్సిన్ నీళ్ల విరేచాల నుంచి పిల్లల్ని రక్షిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఉచితంగా ప్రభుత్వ దవాఖానలకు రోటా వ్యాక్సిన్ సరఫరా చేస్తుందన్నారు. తల్లులు ప్రతి బిడ్డకు వ్యాక్సిన్ తప్పకుండా వేయించాలని సూచిం చారు. ఇక్కడ సర్పంచ్ బూర్ల సింధూజ, జడ్పీ వైస్ చైర్మన్ మండిగ రేణుక, ఎంపీడీఓ శ్రీనివాస్‌మూర్తి, మండల వైద్యాధికారి నిస్సీ క్రిస్టినా, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ఓదెల: పిల్లలను నీళ్ల వినేచనాల నుంచి రక్షించే రోటా వైరస్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ఓదెల పీహెచ్‌సీలో ఎంపీపీ కునారపు రేణుకాదేవి శుక్రవారం ప్రారం భించారు. ఈ సందర్భంగా డాక్టర్ నీతూరెడ్డి మాట్లాడుతూ, రోటా వైరస్ వ్యాక్సిన్ ద్వారా పిల్లలకు నీళ్ల విరేచనాలు నుంచి రక్షించే వ్యాక్సిన్ ఇప్పుడు సార్వత్రిక వ్యాధి నిరోధక టీకా అందుబాటులో ఉంటుందని వివరించారు. ప్రజలు తమ బిడ్డలకు రొటా వైరస్ వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది విద్యాసాగర్, కృష్ణవేణి, సమ్మక్క, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...