గుండ్లపల్లిలో ఉచిత వైద్య శిబిరం


Sat,September 21, 2019 01:11 AM

ఓదెల: కొలనూర్ పీహెచ్‌సీ ఆధ్వర్యంలో గుండ్లపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధు లు వస్తుండడంతో ముందు జాగ్రత్తగా వైద్య సిబ్బంది వైద్య శిబిరం ఏర్పాటు చేసి ప్రజలకు పరీక్షలు చేశారు. అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చే శారు. ప్రస్తుత సీజన్‌లో వ్యక్తిగత పరిశుభ్రతతో పా టు పరిపరాలు శుభ్రంగా ఉంటే రోగాలు రాకుం డా ఉంటాయని వివరించారు. ఎలాంటి రోగం వచ్చినా నిర్లక్ష్యంగా ఉండకుండా వెంటనే దవాఖానకు రావాలని కోరా రు. కార్యక్రమంలో సర్పంచ్ పులు గు తిరుపతిరెడ్డి, డాక్టర్ దీప్తి, సీహెచ్‌ఓ షమీమ్, వైద్య సిబ్బంది అశోక్, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఆదర్శలో ..
జూలపల్లి : పెద్దాపూర్‌లోని ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు డాక్టర్ అనిత శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. పలువురి నుంచి రక్త నమూనాలు సేకరిం చారు. విద్యార్థులకు ఐరన్, క్యా ల్షియం మందులు పంపిణీ చేశారు. ఆరోగ్య సమస్యలు, సీజనల్ వ్యాధుల నిర్మూలనపై అవగాహన కల్పించారు. ఇక్కడ ఎంపీటీసీ సభ్యురాలు గొట్టెముక్కుల రజని, గ్రామ ప్రత్యేకాధికారి వినోద్‌కుమార్, పంచాయతీ కార్యాదర్శి పున్నమయ్య, ప్రిన్సిపాల్ పద్మశ్రీ, కంకణాల జ్యోతిబసు, ఏఎన్‌ఎంలు, ఉపాధ్యాయులు తదితరులున్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...