రేపు కటికెనపల్లిలో ఉచిత వైద్య శిబిరం


Sat,September 21, 2019 01:11 AM

ధర్మారం : ధర్మారం మండలం కటికెనపల్లిలో ఆదరణ ఫ్యామిలీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 22న ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ఆ గ్రామ ఎంపీటీసీ సభ్యుడు సూరమల్ల శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శిబిరంలో డాక్టర్లు నయని (డీజీఓ), అనిల్ కుమార్ (ఎంఎస్), నాగదేవి, శ్రీనివాస్,శ్రీవాణి (ఎంబీబీఎస్)లు వైద్య సేవలు అందిస్తారని ఆయన వివరించారు.ఈ శిబిరాన్ని ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జడ్పీ సభ్యురాలు పూస్కూరు పద్మజ ప్రారంభిస్తారని తెలిపారు. కటికెనపల్లి ఎంపీటీసీ పరిధిలోని కటికెనపల్లి, చామనపల్లి, న్యూ కొత్తపల్లి ప్రజలు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవా లని శ్రీనివాస్‌తో పాటు సర్పంచ్ కారుపాకల రాజయ్య, ఉప సర్పంచ్ రామడుగు గంగారెడ్డి కోరారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...