అవయవదానంపై అవగాహన


Fri,September 20, 2019 01:17 AM

సుల్తానాబాద్‌రూరల్: తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అదేశాల మేరకు మండలంలోని సాంబయ్యపల్ల్లి గ్రామపంచాయతీ పరిధిలోని నిగమ ఇంజినిరింగ్ కళాశాలలో గురువారం తెలంగాణ జాగృతి విద్యార్థి సమాఖ్య పెద్దపల్లి జిల్లా నాయకుడు మడ్డి సాయికిషోర్‌గౌడ్ ఆధ్వర్యంలో అవయవదానంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకుడు కండేం సురేష్ హాజరై మాట్లాడుతూ, అవయవదానంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని అన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు భాగ్యస్వాములు కావాలని కోరారు. 60 మంది విద్యార్థులు అవయవదానం ఇవ్వడాని ముందుకు రావడం జరిగిందన్నారు. ఇందులో గర్రెపల్లి ఎంపీటీసీ పులి అనూష, జిల్లా నాయకులు మొల్గూరి స్వప్న, లావణ్య, సందీప్, అరవింద్, విద్యార్థులతో పాటు తదితరులు ఉన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...