పెయింటర్స్ సంఘం అధ్యక్షుడిగా మనోహర్‌రెడ్డి


Fri,September 20, 2019 01:16 AM

సుల్తానాబాద్: జిల్లా బిల్డింగ్ పెయింటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు నల్ల మనోహర్‌రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గురువారం సుల్తానాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ఈ ఎన్నిక జరిగినట్లు కమిటీ బాధ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం నల్ల మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఈ పదవి అప్పజెప్పిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అధ్యక్షుడిగి ఎన్నికైన మనోహర్‌రెడ్డిని స్థానిక టీఆర్‌ఎస్ నాయకులు, పెయింటర్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల కన్వీనర్ బుర్ర శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీటీసీలు సూరశ్యాం, పల్ల సురేశ్, రాజిరెడ్డి, సతీశ్‌రెడ్డి పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...