పేదలకు సీఎంఆర్‌ఎఫ్ వరం


Fri,September 20, 2019 01:16 AM

కలెక్టరేట్: పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఓ వరంలా మారిందనీ శాసనమండలి విప్ తానిపర్తి భానుప్రసాదరావు అన్నారు. పెద్దపల్లి మండలంలోని అప్పన్నపేట గ్రామానికి చెందిన శ్రావణ్‌కుమార్‌కు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.2.50లక్షల ఎల్‌వోసీని మండలి విప్ సీఎంవో కార్యాలయం నుంచి మంజూరు చేయించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని తన నివాసంలో సంబంధిత కుటుంబసభ్యులకు భానుప్రసాదరావు ఎల్‌వోసీ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద వర్గాలను అన్ని విధాలుగా ఆదుకోవాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తూ ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తున్నారని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని, రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్‌కు వెన్నంటి ఉంటూ తెలంగాణ ప్రభుత్వానికి అండగా ఉండి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్‌ఎస్ నాయకులున్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...