క్రీడారంగానికి అధిక ప్రాధాన్యత


Thu,September 19, 2019 02:08 AM

-పీవీ సింధూను ఆదర్శంగా తీసుకోవాలి
-మౌలిక వసతుల కల్పనకు కృషి
-జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్
-సుల్తానాబాద్‌లో ఉమ్మడి జిల్లాలస్థాయి అండర్ 14 వాలీబాల్ పోటీలు
-విజేతలకు డీసీపీ సుదర్శన్‌గౌడ్ బహుమతుల పంపిణీ

సుల్తానాబాద్: తెలంగాణ ప్రభుత్వం క్రీడారంగానికి అధిక ప్రాధాన్యతనిస్తుందనీ, అవకాశాన్ని అధికారులు, క్రీడాకారుల సద్వినియోగం చేసుకొని జిల్లాను ముం దువరుసలో ఉంచేలా కృషి చేయాలని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ పిలుపు నిచ్చారు. సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 65వ పాఠశాలల క్రీడోత్సవాల్లో భాగంగా అండర్-14 ఉమ్మడి జిల్లాల స్థాయి వాలీబాల్ పోటీలను నిర్వహించారు. పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. జిల్లాలో క్రీడారంగాభివృద్ధికి మౌలిక వసతులు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. సుల్తానాబాద్‌లో వృథాగా ఉన్న స్టేడియాన్ని ఉపయోగంలో తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పీవీ సింధును క్రీడాకారులంతా ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం పోటీలను ప్రారంభిస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు.

క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను బాల్‌తో సర్వీస్ చేసి జడ్పీచైర్మన్ ప్రారంభించారు. ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి బాబు శ్రీనివాస్ మాట్లాడుతూ, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లా ల నుంచి పాల్గొన్న క్రీడాకారుల నుంచి ఉత్తమమైన క్రీడాకారులను ఎంపిక చేసి రాష్ట్రస్థాయి పోటీలకు పం పనున్నట్లు తెలిపారు. అలాగే స్పోర్ట్స్ క్లబ్‌కు చెందిన అంతటి శంకరయ్య, ఎండీ యూనస్‌పాషా, దూడం సురేశ్ ఉత్తమ ఉపాధ్యాయలుగా అవార్డులు స్వీకరించిన సందర్భంగా వారిని ఘనంగా సన్మానించారు. వివేకానంద పాఠశాలకు చెందిన విద్యార్థులు నృత్యాలు చేసి ఆకట్టుకున్నారు. డీఈఓ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన చేపట్టిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు, గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ రఘువీర్‌సింగ్, ఎంపీపీ బాలాజీరావు, జడ్పీ సభ్యురాలు స్వరూపరాణి, ప్రిన్సిపాల్ శ్రీధర్‌రావు, మనోజ్‌గౌడ్, ముస్త్యాల రవీందర్, దూడం రమేశ్, బాలసాని రాజ్‌కుమార్, దాసరి రమేశ్, బిట్ర శ్రీనివాస్, ముస్తాఫా, కిశోర్, సిలివేరి మహేందర్ తదితరులున్నారు.

క్రీడల్లోనే పాల్గొనేలా ప్రోత్సహించాలి
విద్యార్థులను క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని డీసీపీ సుదర్శన్‌గౌడ్ అన్నా రు. ఎస్జీఎఫ్ వాలీబాల్ క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. అనంతరం విజేతలకు డీసీపీ బహుమతులను అందజేశారు. గోదావరి అర్బన్ బ్యాంక్ మేనేజర్ సంతోష్‌కుమార్ స్పోర్ట్స్ క్లబ్‌కు టీ షర్టులను అందజేయగా, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మిట్టపెల్లి ప్రవీణ్‌కుమార్ క్రీడల అభివృద్ధికి రూ. లక్ష అందజేస్తానని హామీఇచ్చారు. బాలుర విభాగంలో పెద్దపల్లి ప్రథమ స్థానంలో, జగిత్యాల జట్టు ద్వితీయస్థానంలో, బాలికల విభాగంలో కరీంనగర్ జట్టు ప్రథ మ స్థానంలో, జగిత్యాల జట్టు ద్వితీయస్థానంలో నిలిచింది. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే క్రీడాకారుల ఎంపిక జాబితాను ప్రకటించారు. కార్యక్రమం లో సీఐ మహేందర్‌రెడ్డి, ఎస్‌ఐ రాజేశ్, ఎంఈఓ నర్సింగం, శంకరయ్య, మధుకర్ యాదవ్, తిరుపతి, కుమార్ కిశోర్, సంతోష్‌కుమార్ తదితరులున్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...