రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి


Wed,September 18, 2019 02:07 AM

కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లా వ్యా ప్తంగా రైతుల సమస్యలు తెలుసుకునేందుకు ఇం టింటి సర్వే నిర్వహిస్తున్నామనీ, ఇందులో భాగం గా సమస్యలు అక్కడిక్కడే పరిష్కరించాలని జా యింట్ కలెక్టర్ జీవీ శ్యామ్ ప్రసాద్‌లాల్ తాసిల్దార్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో భూ రికార్డుల ప్రక్షాళనపై తాసి ల్దార్లతో సమీక్షించారు.ఈ సందర్భంగా జేసీ మా ట్లాడుతూ ముందుగా రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వీఆర్‌ఓల చేత పకడ్బందీగా సర్వే చే యించాలని సూచించారు. సర్వే నంబర్లు, పహణీల వారీగా వివరాలు వీఆర్‌ఓలకు అందజే యాలన్నారు. తాసిల్దార్లు, నాయబ్ తాసిల్దార్లు సిబ్బందితో బృందాలుగా ఏర్పడి ఇంటింటి కి వెళ్లి రైతుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలన్నారు. తాసిల్దార్లు వెంట కంప్యూటర్, ప్రిం టర్, రికార్డులు తీసుకెళ్లాలని, వారంలో మూడు రోజు లు, రెండు గ్రామాల చొప్పున సర్వే పూర్తి చేయాలన్నారు. నేరుగా రైతులను కలుసుకుని మ్యూటేషన్, నాలా ఖాతాలు, పాసు పుస్తకాలు, విరాసత్, సాదా బైనామా తదితర సమస్యల్లో తప్పులుంటే వాటిని అక్కడిక్కడే సరిచేసి ఇవ్వాలన్నారు. సర్వే ల వారీ రిజిస్టర్, రైతువారి రిజిస్టర్ నిర్వహించాలన్నారు. భూ సమస్యలపై ఫీల్డ్ వర్క్ చేయడంతో పాటు విచారణ పూర్తి చేసి ఫైళ్లను లాగిన్‌లో న మో దు చేయాలన్నారు. కోర్టు కేసులు లేని భూముల భూ సమస్యలన్నింటిని వెంటనే పరిష్కరించి పాసు పుస్తకాలు పంపిణీ చేయాలని ఆదేశించారు. డిజిటల్ సంతకాలు త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. పట్టాదారు చనిపోతే వారి వారసులకు భూమినిచ రైతులు భూములు అమ్మినచో కొనుగోలు చేసిన రైతులకు అట్టి భూమిని మ్యూటేషన్ చేయాలని సూచించారు. జిల్లాలో రైతు ఖాతాలకు ఆధార్‌తో అనుసంధానం కాని వాటిని వెంటనే చేయాలన్నారు. ప్రభుత్వ ఖాతాలను, నాలాలను ధరణి వెబ్‌సైట్‌లో మార్కు చేయాలని, మ్యూటేషన్, పెండింగ్ మ్యూటేషన్‌లను పూర్తి చేయాలన్నారు. రైతుబాట ద్వారా రైతులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలన్నారు. రైతుబాట, రైతు మాటలో వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని తాసిల్దార్లను ఆదేశించారు. కరీంనగర్, హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్ అధికార్లు ఎన్ ఆనంద్‌కుమార్, బీ చెన్నయ్య పాల్గొన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...