నిబంధనలు పాటించాలి


Mon,September 16, 2019 03:20 AM

పెద్దపల్లిటౌన్: పెద్దపల్లి పట్టణ వ్యాపారులు నిబంధ నలు పాటించాలని, వినియోగదారులను తూకం లో మోసాలకు గురిచేస్తే చర్యలు తప్పవని జిల్లా తూనికలు, కొలతల అధికారి కే విశ్వేశ్వర్‌రావు అన్నారు. ఆదివారం జి ల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్, జెండాచౌరస్తా, కూరగాయల మార్కెట్, ఫిష్, చికెన్, మటన్ మార్కెట్లల్లో కాంటా బాట్లను పరిశీలించి తనిఖీలు చేపట్టారు. బాట్లు, కాంటాలకు ముద్రలు లేని వాటిని సీజ్ చేసి వా టికి జరిమానా విధించా రు. తూనికలు కొలతల్లో తప్పుగా ఉన్న ఏడుగురు వ్యాపారులపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతీ వ్యాపారస్తుడు కొలతలకు ఎలక్ట్రికల్ డిజిటల్ కాంటాలను వాడాలని కోరా రు. చికెన్, మటన్ ఫిష్ వ్యాపారస్తులు నాణ్యమైన మాంసా న్నే విక్రయించాలని ఆదేశించారు. లేకపో తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లావ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నట్లు వివరించారు. దుకాణల్లో ప్లాస్టిక్ కవర్లను వాడరాదని, జ్యూ ట్ బ్యాగులకు వాడాలని కోరారు. పెద్దపల్లి ఎస్‌ఐ ఉప్పతల ఉపేందర్‌రావు, సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...