రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థుల ప్రతిభ


Mon,September 16, 2019 03:19 AM

సుల్తానాబాద్: మేడ్చల్‌లో మూడు రోజులుగా జరుగుతున్న రాష్ట్రస్థాయి జూడో పోటీల్లో జిల్లా విద్యార్థులు పతకాలు సాధించి ప్రథమస్థానంలో నిలిచారు. రాష్ట్ర జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో పెద్దపల్లి జిల్లా నుంచి పాల్గొన్న మాతృశ్రీ, బండ శివశంకర్, (ఆల్ఫోర్స్ పాఠశాల, సుల్తానాబాద్), సన్విత, ఈశ్వర్, (గోదావారిఖని), కౌశిక్ (ప్రభుత్వ పాఠశాల, సుల్తానాబాద్)లు పలు విభాగాల్లో అద్వితీయమైన ప్రతిభను కనబరిచి పతకాలను సొంతం చేసుకున్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులను కరీంనగర్ జూడో సంఘం అధ్యక్ష,కార్యదర్శులు అనంతరెడ్డి, గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి, పెద్దపల్లి జూడో సంఘం అధ్యక్షుడు మాటేటి సంజీవ్, సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు ముస్త్యాల రవీందర్, సీనియర్ క్రీడాకారులు అభినందనలు తెలిపారు. ఈ జట్టుకు కోచ్‌గా కామ శ్రీనివాస్, మేనేజర్‌గా మహేందర్, ఆర్ నారాయణ, అంతటి శంకరయ్యలు వ్యవహరించారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...