ఖోఖో ఎంపిక పోటీలకు స్పందన


Mon,September 16, 2019 03:18 AM

కరీంనగర్ స్పోర్ట్స్: నగరంలోని సెయింట్ జాన్స్ ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా జూనియర్స్ బాలబాలికల ఖోఖో జట్ల ఎంపిక పోటీలకు విశేష స్పందన లభించింది. కరీంనగర్ జిల్లా ఖోఖో అడ్‌హాక్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉ మ్మడి జిల్లా జట్ల ఎంపికలకు మంథని, కాటారం, మా నకొండూర్, వేంపేట, సిరిసిల్ల, కోహెడ, హుస్నాబాద్, జగిత్యాల, కోరుట్ల, పెద్దపల్లి, కొడిమ్యాల, నగునూర్ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో క్రీడాకారులు హాజరయ్యారని అడ్‌హాక్ కమిటీ సభ్యుడు పేర్కొన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులు అక్టోబర్ 1, 2, 3వ తేదీల్లో నిర్మల్‌లో జరుగనున్న రాష్ట్రస్థాయి జూనియర్ ఖోఖో పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు. పో టీల నిర్వహణలో వ్యాయామ ఉపాధ్యాయులు సమ్మిరెడ్డి, తిరుపతిరెడ్డి, సూర్యప్రకాశ్, రవీందర్, సంధ్యారాణి, జ్యోతి, శ్రీలత, సంతోష్, కొమురయ్య, కోచ్‌లు నరేశ్, జలంధర్, ప్ర సాద్, మల్లేశం, మధు, సంతోష్, అశోక్, రాజబాబు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

27
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...