ప్రగతిబాటలో స్వచ్ఛ పథం


Sun,September 15, 2019 01:39 AM

-జిల్లాలో జోరుగా 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక అపరిశుభ్రత.. చెత్తపై పల్లెల్లో యుద్ధం
-క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్‌కు అడుగులు -రోజంతా వీధుల్లో పారిశుధ్య పనులు
-వందశాతం మరుగుదొడ్లు.. ఇంకుడు గుంతలకు చర్యలు
-అధికారులు, ప్రజాప్రతినిధుల కృషితో పరుచుకుంటున్న ప్రగతి దారులు వెల్లివిరుస్తున్న చైతన్యం
-ఊరూరా పండుగ వాతావరణం -రామగిరి మండలం రాజాపూర్‌లో పాల్గొన్న జడ్పీ చైర్మన్ పుట్ట మధు

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఆరోగ్య వంతమైన సమాజమే లక్ష్యంగా.. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా జిల్లాలోని ప్రతి పల్లె కదులుతున్నది.. 30 రోజుల కార్యాచరణ ప్రణాళికతో ప్రతి పల్లె ప్రగతి వైపునకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన మహాక్రతువును విజయవంతం చేసేందుకు గ్రామాల్లో సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు ముందుకు కదులుతున్నారు. ఈ నెల 6 తేదీన ప్రారంభమైన పల్లెప్రగతి కార్యక్రమంలో ఉత్సాహాన్ని నింపేందుకు ఇప్పటికే రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్వయంగా జిల్లాలోని మూడు గ్రామాల్లో పర్యటించడంతో రెట్టింపు ఉత్సాహంతో ప్రజా ప్రతినిధులు, అధికారు లు ముందుకు కెళ్తున్నారు. ఒకవైపు గ్రామాల్లోని పిచ్చి మొ క్కలు, చెత్తకుప్పలను తొలగిస్తూ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. బురదమయంగా మారుతున్న మట్టిరోడ్లను చదును చేస్తూ మరమ్మతు చేపడుతున్నారు. గ్రామాల్లో పందులు, పందికొక్కులు, దోమలకు ఆవాసాలుగా మారి ప్రమాదకరంగా ఉన్న కూలిన ఇండ్లు, పాడుబడ్డ బావుల పనిపడుతున్నారు. గ్రామాల్లో ప్రమాదకరంగా ఊగుతూ.. సాగు తూ.. జన, జీవాలకు ప్రమాదాలను తెచ్చి పెడుతున్న విద్యుత్ తీగలను సరిచేయడంతో పాటుగా ట్రాన్స్ ఫార్మర్ల వద్ద ప్రమాకరంగా ఉన్న వాటిపై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నారు. ఎక్కడైతే విద్యుత్ తీగలు లూజుగా ఉన్నాయో వాటిని సరిచేస్తూనే అవసరమైన చోట్ల కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. కలెక్టర్ శ్రీదేవసేన ప్రత్యేక ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా 100శాతం మరుగుదొడ్ల నిర్మాణం, ఇంకుడు గుంతల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నారు. హరితహారంలో నాటిన మొక్కలకు అన్ని శాఖల అధికారులు పూర్తి రక్షణగా నిలుస్తున్నారు. పలు ప్రాంతాల్లో నాటిన మొక్కలను వ్యక్తులు నాశనం చేసినా.. వారి పశువులు మేసినా జరిమానాలను పెద్ద ఎత్తున విధిస్తూ మొక్కల రక్షణ బాధ్యతను ప్రజలకు గుర్తు చేస్తున్నారు. అదే విధంగా హరితహారం మొక్కల రక్షణ కోసం బిగించిన ట్రీగార్డులను తొలగించినా, దొంగిలించినా వారిపై కేసులు నమోదు చేస్తూనే వారికి భారీ జరిమానాలు విధించి వారి ద్వారా తిరిగి ట్రీగార్డులను బిగించేందుకు చర్యలు చేపడుతున్నారు. రామగిరి మండలం రాజాపూర్‌లో చేపట్టిన కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ పుట్ట మధు హాజర య్యారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...