టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధికి బాటలు


Sun,September 15, 2019 01:32 AM

కలెక్టరేట్ : టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి, ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించనప్పటి నుంచే రాష్ట్రంలో అభివృద్ధికి బాటలు పడ్డాయని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులవుతున్న వారంతా, పార్టీలకతీతంగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని తెలిపారు. పెద్దపల్లి మండలం మూలసాలకు చెందిన మాజీ సర్పంచ్ మందల రాంరెడ్డి ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. జిల్లా కేంద్రంలోని దాసరి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రాత్రి వారందనికీ ఎమ్మెల్యే దాసరి గులాబీ కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ ఆకర్షితులవుతున్నారని తెలిపారు.

వారంతా పార్టీలకతీతంగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మూలసా ల గ్రామానికి చెందిన హ్యాట్రిక్ మాజీ సర్పంచ్ మందల రాంరెడ్డి తన అనుచర వర్గంతో కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారని చెప్పారు. రా ష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచే అభివృద్ధికి బాటలు పడ్డాయన్నారు. గతంలో దశాబ్ధాల కాలం పాటు రాష్ర్టాన్ని పాలించిన పాలకులంతా ఏనాడు కూడా అభివృద్ధి సంక్షేమాల గురించి ఆలోచించిన పాపాన పోలేదని విమర్శించారు. ఆనాడు అధికారంలో ఉండగా కనీస ఆలోచన లేని నాయకులంతా, నేడు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా వారు ఆత్మ విమర్శ చేసుకుని మాట్లాడాలని హితవుపలికారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు మర్కు లక్ష్మణ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...