ఆలోచనల అక్షరరూపమే కవిత్వం


Sun,September 15, 2019 01:32 AM

రిసిల్ల ఎడ్యుకేషన్ : మనకు వచ్చిన ఆలోచనలు, భావలకు అక్షర రూపమిస్తే అవే కథలు, కవిత్వాలుగా తయారవుతాయని ప్రముఖ సినీ న టు డు డాక్టర్ భూపాల్‌రెడ్డి వివరించారు. సిరిసిల్లలో ని రంగినేని సుజాత మోహన్‌రావు ఎ డ్యుకేషన్, చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన రెండు రోజుల పిల్లల పండుగ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భం గా భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి పిల్లల పండుగ (రచన కార్యశాల) నిర్వహిస్తున్నా రంగినేని ట్రస్టు నిర్వహుకులడు మోహన్‌రావును ప్ర త్యేకంగా అభినందించారు. కథలు, కవిత్వాలు రాయాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులకు రెండు రోజలు పాటు శిక్షణ తరగతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. నూత న రచయితలకు ఇదొక వేదికని అ భివర్ణించారు. ఇండ్లలో పెద్దలు చెప్పిన కథలు, రచయితల కథ లు, కవిత్వాలను క్షేత్రస్థాయిలో చదవాలన్నారు. సమాజనికి ఉపయోగపడేవిధంగా, నూతన ఒరవడికి శ్రీ కారం చుట్టేలా రచనలు ఉండాలన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...