మహా గణపతి నిమజ్జనం


Sat,September 14, 2019 04:22 AM

-ప్రతిష్టించిన చోటే కార్యక్రమం..
-రూ.1.05 లక్షలు పలికిన లడ్డు
-ప్రతిష్టించిన చోటే భారీ గణనాథుడి నిమజ్జనం

కలెక్టరేట్: జిల్లా కేంద్రంలోని సురభి కాలనీలో ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో గణపతి నవరాత్రోత్సవాల సం దర్భంగా ఏర్పాటు చేసిన భారీ ఎత్తు (39 ఫీట్ల) గల మట్టి వి నాయకుడి విగ్రహానికి శుక్రవారం రాత్రి ప్రతి ష్టించిన చోటనే వాటర్ ట్యాంకర్ల ద్వారా నిమ జ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్ర మాన్ని వీక్షించేందుకు పెద్దపల్లితో పాటు మండ లంలోని పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున హాజ రుకాగా, సుమారు నాలుగు గంటల పాటు గడ్డి, మట్టి వినాయ కుడికి వీడ్కోలు పలుకుతూ బ్యాండు మేళతాళాలతో కార్యక్రమాన్ని ముగిం చారు. ప్రత్యేక డ్రా కార్యక్రమంలో మొదటి బహుమతిగా స్కూటీ, రెండో బహుమతిగా సైకిల్, మూడో బహుమతిగా డ్రెస్సింగ్ టేబుల్‌ను పెట్టడంతో పెద్ద ఎత్తున భక్తులు హాజరై డ్రాలో పాల్గొన్నారు.

గణపతి లడ్డూ 1.05 లక్షలు
లడ్డూ వేలంలో 1.05 లక్షలు పలికింది. శుక్రవారం వేలం నిర్వహించగా, పెద్దపల్లికి చెందిన టీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు రేగుంట అశోక్‌గౌడ్ కొడుకు శివతేజ గౌడ్ సమీప పాటదారులతో పోటీ పడి దక్కించుకున్నాడు. లడ్డూను జిల్లాలోని స్వీట్‌హౌస్‌ల్లో ప్రత్యేకతగా పేరుగాంచిన పెద్దపల్లిలోని మిలన్ హోటల్‌లో 51కిలోల బరువుతో ప్రత్యేకంగా తయారు చేయించారు.

ఓటరు నమోదు మొబైల్ యాప్‌పై అవగాహన
ఓదెల: బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్‌ఓ)లకు ప్రత్యేక ఓటరు నమోదు ఆన్‌లైన్ యాప్‌పై శుక్రవారం తాసిల్దార్ కార్యాయలంలో అవగాహన సమావేశం నిర్వహించారు. ఇందులో స్పెషల్ సమ్మరి రివిజన్ - 2020పై తాసిల్దార్ గుండాల్వర్ శ్రీకాంత్ వివరించారు. డూప్లికేట్ ఓటరు ఆన్‌లైన్‌లో సరి చేసే విధానాన్ని తెలిపారు. బీఎల్‌ఓలు తమ పోలింగ్‌స్టేషన్ పరిధిలో ఇంటింటికీ తిరుగుతూ ఆన్‌లైన్‌లో ఓటరు నమోదును చేయాలని కోరారు. ఓటరు నమోదు యాప్‌పై స్మార్ట్ ఫోన్‌లలో ఎలా చేయాలనే అంశంపై అవగాహన కల్పించారు. అలాగే ఎస్‌ఎస్‌జీ-2019 పోటీలను ఓదెలలో విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో నయాబ్ తాసిల్దార్ వసంతరావు, గిర్దావర్ వినయ్‌కుమార్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్: పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేట ప్రభుత్వ పాఠశాలలో డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు శుక్రవారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో నరేందర్, సత్యనారాయణరెడ్డి, నవనీత, స్వామి, శ్రీదేవి, మమత, భాగ్యలక్ష్మి, రమేశ్, కృష్ణారెడ్డి, సురేశ్, సమ్మయ్య, తిరుపతి, జె. కొమురయ్య, కె. సదయ్య తదితరులున్నారు.

ట్రాన్స్‌కోకు బకాయిల చెల్లింపు
కలెక్టరేట్: విద్యుత్‌శాఖలో కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న గ్రామ పంచాయతీల బకాయిలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జమ అవుతున్నాయి. ప్రస్తుతం బకాయి ఉన్న వాటిలో 3వ వంతు చొప్పున గ్రామ పంచాయతీలు చెల్లిస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే 15 రోజుల క్రితం పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామంలో 3.80లక్షలను సర్పంచ్ గంట లావణ్య ట్రాన్స్‌కో ఏఈ వెంకటనారాయణకు చెల్లించారు. అలాగే అప్పన్నపేటలో శుక్రవారం 4లక్షలను సర్పంచ్ చీకటి స్వరూప ఆధ్వర్యంలో వార్డు సభ్యులు ట్రాన్స్‌కో ఏఈకి చెల్లించిన పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ బోండ్ల శ్రీనివాస్, నాయకులు చీకటి పోచాలు, శ్రీనివాస్, విజయారావు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యేకు పరామర్శ
ఎలిగేడు(జూలపల్లి) : ఎలిగేడు మండలంలోని శివపల్లి గ్రామానికి చెందిన పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావును రాష్ట్ర టెక్నికల్ సర్వీసెస్ కార్పొరేషన్ చైర్మన్ చిరుమల్ల రాకేశ్ శుక్రవారం పరామర్శించారు. విజయరమణారావు సోదరుడు భూంరావు అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతి చెందాడు. ఈ క్రమంలో రాకేశ్ బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఇక్కడ టీఆర్‌ఎస్ నాయకులు రాజు, దేవేందర్‌రెడ్డి, ఉప్పు శివ, రాకేశ్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...