సమాచార హక్కు చట్టంపై అవగాహన


Sat,September 14, 2019 04:20 AM

రాంమందిర్ ఏరియా : నగరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఫోరం ఫర్ ఆర్టీఐ ఆధ్వర్యంలో విద్యార్థులకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ఫోరం ఫర్ ఆర్టీఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాంతయ్య హాజరై మాట్లాడారు. సమాచార హక్కు ప్రజలకు వజ్రాయుధం లాంటిదనీ, సమాచారం పొందడం మన హక్కు అని అన్నారు. గ్రామ కార్యదర్శి నుంచి ప్రధాన మంత్రి వరకు అందరూ ఖచ్చితంగా సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయంలో ప్రజలకు అడిగిన సమాచారాన్ని అధికారులు సకాలంలో ఇవ్వాల్సిందేనన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, కళాశాల ప్రిన్సిపాల్ అంజయ్య, ఫోరం జిల్లా అధ్యక్షుడు విక్రమ్ సింగ్, వేముల అశోక్, కొప్పుల శ్రీధర్, ప్రవీణ్, స్వామి, గౌతమ్, ఎన్‌ఎస్‌ఎస్ పోగ్రాం అధికారి డి.శంకర్ తదితరులు పాల్గొన్నారు.

19
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...