20న పీడీఎస్ బియ్యం వేలం


Sat,September 14, 2019 04:20 AM

జ్యోతినగర్ : పౌర సరఫరా, రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించి అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడి స్వాధీన పరుచుకున్న పీడీఎస్ బియ్యాన్ని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 20న వేలం వేయనున్నారు. ఈ క్రమంలో రామగుండం మండల కార్యాలయంలో ఉదయం 11 గంటలకు వేలం నిర్వహించనున్నట్లు మండల తాసిల్దార్ రామచంద్రయ్య పేర్కొన్నారు. మండలంలో మొత్తం 25 ప్రాంతాల్లో భద్రపరిచిన దాదాపు 425 క్వింటాళ్ల బియ్యం వేలంలో ఉంచనున్నట్లు తెలిపారు. వేలంలో పాల్గొనుటకు అర్హత, ఆసక్తి గల వారు రూ.2000 రుసుం చెల్లించి వేలంలో పాల్గొన్నారు. వేలం జరుగే ముందు రోజుల్లో సరుకులను పరిశీలించుకునేందుకు అనుమతించబడుతుందని తెలిపారు.

20
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...