ఘనంగా హిందీ దివస్


Sat,September 14, 2019 04:20 AM

రాంమందిర్ ఏరియా : స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం హిందీ భాషా దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ దాదాసలాం హాజరై మాట్లాడుతూ, భారతదేశంలోని వివిధ ప్రాంతాల మధ్య సమన్వయం కుదర్చడంలో హిందీ భాష ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. హిందీ భాషా నేర్చుకోవడం ద్వారా భారతీయ ఆత్మను అర్థం చేసుకోగలమని తెలిపారు. అనంతరం వ్యాసరచన, ఉపన్యాస పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందచేశారు. కార్యక్రమంలో హిందీ విభాగం అధ్యక్షురాలు తహసీన్ ఫాతిమా, టి.హరీశ్, నరేందర్ రెడ్డి, జి.సుబ్బారావు, కిరణ్మయి, నరేశ్, అజయ్‌కుమార్, సంతోష్, సంగీత తదితరులు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...