జిల్లా అసోసియేట్ అధ్యక్షుల ఎన్నిక


Sat,September 14, 2019 04:20 AM

జ్యోతినగర్ : పీఆర్‌టీయూ పెద్దపల్లి జిల్లా అసోసియేటివ్ అధ్యక్షులుగా అంతర్గాం ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఇరుగురాల ఓదెలు, మహిళా అసోసియేట్ అధ్యక్షురాలిగా యూపీఎస్ బ్రహ్మణపల్లి పాఠశాల ఉపాధ్యాయురాలు ఎన్ రామలక్ష్మి ని ఎన్నుకున్నట్లు శుక్రవారం పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు కర్రు సురేశ్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన జిల్లా పీఆర్‌టీయూ సర్వసభ్య సమావేశంలో 2019-2021కు గాను మెజార్జీ సభ్యుల తీర్మాణం మేరకు ఇద్దరిని ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఎన్నికకు సహకరించిన పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి సురేశ్, నాగేశ్వర్‌రావు, అంతర్గాం మండలం అధ్యక్షుడు, రాచర్ల శ్రీనివాస్, కందుల సతీశ్‌కు నూతన అసోసియేట్ అధ్యక్షులు ఓదెలు, రామలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు.

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...