అందరి సహకారంతోప్రశాంతంగా నిమజ్జనోత్సవం


Sat,September 14, 2019 04:19 AM

ఫెర్టిలైజర్‌సిటీ : జిల్లా వ్యాప్తంగా వినాయక నవరాత్రోత్సవాలతోపాటు నిమజ్జనోత్సవాలు భక్తులు, ప్రజలు ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో ప్రశాంతంగా ముగిసిందని పెద్దపల్లి డీసీపీ సుదర్శన్ గౌడ్ ప్రకటనలో పేర్కొన్నారు. నవరాత్రోత్సవాలు మొదలుకొని నిమజ్జనం వరకు ప్రతి విగ్రహ కమిటీ ఉత్సవ నిర్వాహకులు జిల్లాలోని ప్రజాప్రతినిధులందరు సహకరించడం ఎంతో అభినందనీయమన్నారు. పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, ఆర్ అండ్ బీ, వైద్య, సింగరేణి, విద్యుత్ శాఖల సమన్వయంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ముందస్తు రక్షణ చర్యల మధ్య వినాయక నవరాత్రోత్సవాలు ప్రశాంతంగా ముగిసాయన్నారు. ఈ నవరాత్రోత్సవాలతోపాటు మొహర్రం వేడుకలను క్రమశిక్షణతో పై అధికారుల ఆదేశాల మేరకు తమ విధి నిర్వహణలో శ్రద్ధ చూపి విశేష కృషి చేసి కష్టపడిన హోంగార్డు నుంచి ఉన్నతాధికారుల వరకు ప్రతి ఒక్కరినీ ఆయన అభినందించారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...