మనగుడి ప్రసాదం పంపిణీ


Sun,August 25, 2019 02:14 AM

కాల్వశ్రీరాంపూర్ : తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని సీతారామ ఆలయంలో శనివారం వరలక్ష్మీ వ్రత కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు టీటీడీ వారు పంపించిన ప్రసాదం పంపిణీ చేసినట్లు ధర్మాచార్య నరెడ్ల సదా నందం తెలిపారు.మండలంలోని ఆయా గ్రామాల్లోని ఆలయాలకు స్వామి వారి కంకణాలు, అక్షింతలు, పసుపు, కుంకుమ, గోవింద నామాల పుస్తక ప్రసాదం, భక్తులకు అందిస్తున్నామని వివరించారు. ఇక్కడ సూపరింటెండెంట్ శ్రీనివాసులు, సహాయకులు గోపి, బాబు, కమిటీ సభ్యులు సతీష్, శ్రీనివాస్, సురేశ్, చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...