అదనపు ఆర్టీసీ బస్సులు నడపాలి


Sun,August 25, 2019 02:14 AM

పెద్దపల్లిటౌన్: పై చదువుల కోసం జిల్లా కేంద్రానికి ధర్మారం, దొంగతుర్తి, వడ్కాపూర్ తదితర గ్రామాల నుంచి వస్తున్న విద్యార్థులకు ఆర్టీసీ అదనపు బస్సులు నడపాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బత్తిని సంతోష్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. శనివారం పెద్దపల్లి నుంచి ధర్మారం వెళ్లే రూట్‌లో బస్సులు లేక విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారని పేర్కొన్నారు. ఇప్పటికైనా కరీంనగర్ ఆర్‌ఎం స్పందించి ధర్మారం-పెద్దపల్లి రూట్‌లో అదనపు బస్సులు కల్పించాలని సామాజిక మాధ్య మం ద్వారా చిత్రాలను పంపినట్లు తెలిపారు. దీనికి స్పందించిన ఆర్ ఎం ప్రయాణికులు రద్దీగా ఉండే మంథని-పెద్దపల్లి, ధర్మారం-పెద్దపల్లి రూట్లలో బస్సులు నడిపించనున్నట్లు తెలిపినట్లు వివరించారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...