ఉద్యమ నేత పీవీ జయంతి వేడుకలు


Sun,August 25, 2019 02:14 AM

సుల్తానాబాద్ : తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి, 1500 వందల రోజు లు దీక్ష శిబిరాన్ని నిర్వహించిన ఉద్యమ నేత పారుపెల్లి వైకుంఠపతి (పీవీ) 62వ జయం తి వేడుకలను టీఆర్‌ఎస్ నాయకులు శనివారం సుల్తానాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఉద్యమంలో ఆయనతో పాల్గొన్న తిప్పారపు దయాకర్, పల్ల సురేశ్, బండి సంపత్, బైరగోని ప్రభాకర్ మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఆయన చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. ఆయన ఆశయ సాధన కు కృషి చేస్తామని పేర్కొన్నారు. పార్టీకి ఎనలేని కృషి చేసిన వైకుంఠపతి కుటుంబానికి టీఆర్‌ఎస్ పార్టీ తరఫున అండగా ఉంటామన్నారు. అనంతరం సుల్తానాబాద్ ప్రభుత్వ దవాఖానాలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో గాజుల అరుణ్, కోట సురేందర్, గోపి, రామకృష్ణ, సుజయ్ తదితరులున్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...