హరితహారం అందరి బాధ్యత


Sun,August 25, 2019 02:13 AM

కాల్వశ్రీరాంపూర్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం అందరి బాధ్యత అని నూనేటి సంపత్ పేర్కొన్నారు. మండలంలోని మంగపేట లో అధికారులతో కలిసి శనివారం మొక్కలు నా టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఇంటింటికీ ఐదు మొక్కలు నాటాలని కోరారు. చెట్లు ఉన్న చోటే సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని గుర్తు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ బుర్ర మంగ, ఉప సర్పంచ్ చుంచు రమేశ్, నాయకులు బుర్ర సదానందం, ఆశా కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

పోలీసు శాఖ ఆధ్వర్యంలో..
ధర్మారం: ధర్మారం మండలం నర్సింహుపల్లిలో శనివారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో హరితహా రం కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ శివారు లోని రాముల గుట్టకు సుమారు 1,500 మొక్క లు నాటారు. నాటిన మొక్కలను దత్తత తీసుకొని పరిరక్షిస్తామని పోలీసులు పేర్కొన్నారు. మొక్కలను సంరక్షించడంతో మానవ మనుగడ ఆధారపడి ఉందని పోలీసులు వివరించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ ప్రేమ్ కుమార్, సర్పంచ్ అడువాల ఆరుణ జ్యోతి, ఎంపీటీసీ సభ్యుడు దాడి సదయ్య, ఉప సర్పంచ్ కత్తెర్ల కోమలత, పీసీ విజయ్ ప్రభాకర్, ఫీల్డు అసిస్టెంట్ కొమిరిశెట్టి సత్యనారాయణ, టీఆర్‌ఎస్ నాయకులు అడువాల రవి, గాండ్ల నర్సయ్య, బొంగాని తిరుపతి, పంబాల స్వామి, బత్తిని రవి, ఎడ్ల మహేశ్, ఆకుల స్వామి, పోలం ప్రసాద్, ఆవుల ఎల్లయ్య, కత్తెర్ల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...